అదిరే డ్యాన్స్‌లు.. ఆది-సుధీర్‌ పంచ్‌లు

యువతను విశేషంగా ఆకట్టుకునే బుల్లితెర కార్యక్రమాల్లో ‘ఢీ ఛాంపియన్స్‌’ ఒకటి. ఒక పక్క వావ్‌ అనిపించే డ్యాన్స్‌లు.. మరోవైపు కడుపుబ్బా నవ్వించే

Published : 23 Aug 2020 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువతను విశేషంగా ఆకట్టుకునే బుల్లితెర కార్యక్రమాల్లో ‘ఢీ ఛాంపియన్స్‌’ ఒకటి. ఒక పక్క వావ్‌ అనిపించే డ్యాన్స్‌లు.. మరోవైపు కడుపుబ్బా నవ్వించే పంచ్‌లతో ‘ఢీ’ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది.

శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ, ప్రియమణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌ నిత్యనూతనంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లో కంటెస్టెంట్‌లు చేసే డ్యాన్స్‌లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. మరోవైపు ప్రదీప్‌, సుధీర్‌, ఆది, వర్షిణి, రష్మి సందడి కితకితలు పెడుతూ ఉంటుంది. ఈ సారి సుధీర్‌ కారావాన్‌ ఫీలింగ్‌ ఎలా ఉంటుందనే టాస్క్‌ను ఆది తనదైన శైలిలో చేసి నవ్వులు పంచారు. ఆగస్టు 26న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌ ప్రోమోనూ మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని