
మెగా థీమ్.. టైటిల్ పట్టేదెవరు?
కొరియోగ్రాఫర్లనే ఫిదా చేసిన ఇద్దరు డ్యాన్సర్లు
హైదరాబాద్: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’. ఈటీవీ వేదికగా పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ‘ఢీ ఛాంపియన్స్’(సీజన్ 12) పేరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో న్యాయనిర్ణేతలుగా శేఖర్, పూర్ణ, ప్రియమణి.. టీమ్ లీడర్లుగా సుధీర్-రష్మి, ఆది-వర్షిణి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఆఖరి పోరాటానికి సిద్ధమైన పియూష్(సుధీర్-రష్మి), సోమేశ్(ఆది-వర్షిణి)లకు శేఖర్ మాస్టర్ మెగాథీమ్ ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలకి గ్రూప్ డ్యాన్స్‌లు చేశారు. పీయూష్ చేసిన డ్యాన్స్ చూసి న్యాయనిర్ణేతలే కాకుండా స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసిన శేఖర్ స్నేహితులు.. ప్రముఖ కొరియోగ్రాఫర్లు సైతం ఫిదా అయ్యారు. ‘చింపేశారు, మాటల్లేవు’ అంటూ ప్రశంసలు కూడా ఇచ్చారు. మరోవైపు సోమేశ్ చేసిన డ్యాన్స్ చూసి జడ్జీలు... ‘వావ్.. సోమూ సార్ సోమూ అంతే’ అంటూ కామెంట్లు అందించారు.
ఫినాలే కంటెస్టెంట్స్ డ్యాన్సులు మాత్రమే కాకుండా అక్సాఖాన్, పండు, రాజులూ కూడా తమ గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో స్టేజ్‌పై అలరించారు. ఈ పవర్‌ప్యాక్డ్ పెర్ఫామెన్స్లు చూడాలంటే వచ్చే బుధవారం వరకూ వేచి చూడాల్సిందే. డిసెంబర్ 9న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్’ గ్రాండ్ ఫినాలే ప్రోమో చూసేయండి..!!
ఇవీ చదవండి
నాలుగు నాటకాలు వేస్తే నాన్న కొట్టేవారు
ఇమాన్యుయేల్ మనసు మంచిది: వర్ష
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.