ఒక్క ‘టీ’ చాలు: వర్షిణి

ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఢీ ఛాంపియన్స్’ డ్యాన్స్‌ షో గురించి అందరికి తెలిసిందే.

Published : 20 Nov 2020 00:11 IST

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఢీ ఛాంపియన్స్’ డ్యాన్స్‌ షో గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఈ షో సెమీ ఫైనల్స్‌ లెవల్‌ 1 పూర్తి చేసుకుని లెవల్‌ 2లోకి అడుగుపెట్టనుంది. శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ, ప్రియమణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షోలో సెమీస్‌ లెవల్‌ 2లో భాగంగా పోటీదారులు తమ ప్రదర్శనలతో మెప్పించనున్నారు. 

సెమీస్‌ లెవల్‌ 1కు మించి లెవల్‌ 2లో పోటీదారులు పోటాపోటీగా తలపడనున్నారు. ‘చిత్తరాల సిరపడు’ అంటూ ఓ పోటీదారుడు మెప్పించనున్నారు. మరోవైపు నరసింహ చిత్రంలోని ‘మెరిసేటి పూవా సిరిమువ్వ’ అనే పాటకు శేఖర్‌, పూర్ణ ఫిదా కానున్నారు. మరోవైపు సుధీర్‌, ఆది, వర్షిణి, రష్మి తమ ఫన్నీ పంచులతో అలరించనున్నారు. ఈ సెమీస్‌ లెవల్‌, వేరే లెవల్‌లో ఉండనుంది. 

షోలో భాగంగా వర్షిణి తన పంచులతో అదరగొట్టేసింది. అందలోని స్కిట్టులో భాగంగా ‘సుధీర్‌ టీటీగా వచ్చి టికెట్‌ అనగా.. ఒక్క ‘టీ’ చాలు’ అని సరదాగా పంచులతో నవ్వులు పూయించనున్నారు. నవంబర్‌ 25న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్‌’ ప్రోమో చూసేయండి. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని