
కుటుంబ సభ్యులతో తారల వేడుకలు
ఇంటర్నెట్ డెస్క్: సినీ రంగం అంటేనే ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమా షూటింగ్ ఉంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచే పనిలో భాగంగా సినీనటులు దాదాపు ఇళ్లకు దూరంగానే ఉండాల్సి వస్తుంది. వాళ్లు పండగలు, ప్రత్యేక దినాల సందర్భంగా కుటుంబంతో కలిసి పాల్గొనడం చాలా అరుదు. అయితే.. ఈసారి మాత్రం పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
* ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు. తన కుమార్తెతో కలిసి తారాజువ్వలు కాల్చుతున్న ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
* ‘నాకిష్టమైన వాళ్లతోనే నేను.. మీరూ మీకిష్టమైనవారితో దీపావళి వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
* కుమార్తెతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఫొటోను మంచు లక్ష్మి అభిమానులతో పంచుకున్నారు.
* బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి దీపాలు చేతిలో పట్టుకున్న ఫొటోను పోస్టు చేశారు.
* తన కుటుంబ సభ్యులతో కలిసి సోనమ్‌కపూర్ ఫొటోను షేర్ చేశారు.
* ‘నాన్న వేగంగా కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమ, దీవెనలతోనే ఇది సాధ్యమైంది. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని సినీ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక పోస్టు చేసింది.