‘భాగమతి’ రీమేక్‌.. ట్రైలర్‌ చూడండి

బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాల రీమేక్‌ హవా కొనసాగుతోంది. రాఘవ లారెన్స్‌ ‘కాంచన’ తర్వాత టాలీవుడ్‌ హిట్‌ ‘భాగమతి’ సినిమాను ‘దుర్గమతి’గా రీమేక్‌ చేశారు. మాతృకలో అనుష్క నటించిన తీరుకు ప్రశంసలు దక్కడంతోపాటు సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.....

Updated : 25 Nov 2020 15:08 IST

అనుష్కగా భూమి పెడ్నేకర్‌

ముంబయి: బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాల రీమేక్‌ హవా కొనసాగుతోంది. రాఘవ లారెన్స్‌ ‘కాంచన’ తర్వాత టాలీవుడ్‌ హిట్‌ ‘భాగమతి’ సినిమాను ‘దుర్గమతి’గా రీమేక్‌ చేశారు. మాతృకలో అనుష్క నటించిన తీరుకు ప్రశంసలు దక్కడంతోపాటు సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందీ రీమేక్‌లో స్వీటీ పాత్రను భూమి పెడ్నేకర్‌ పోషించారు. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు జి.అశోక్‌ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. డిసెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కథాంశంలో ఎటువంటి మార్పులు లేకుండా రీమేక్‌ను తీసినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వేలల్లో లైక్‌లు లభించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని