ET: ఎవరికీ తలవంచడు

‘నాతో ఉన్నవాళ్లెవరూ భయపడకూడదు... మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు’ అంటున్నాడు ఓ వ్యక్తి. ఎవరికీ తలవంచని అతడి కథేమిటో తెలియాలంటే  ‘ఈటి... ఎవరికీ తలవంచడు’ చూడాల్సిందే. సూర్య

Updated : 20 Feb 2022 08:56 IST

‘నాతో ఉన్నవాళ్లెవరూ భయపడకూడదు... మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు’ అంటున్నాడు ఓ వ్యక్తి. ఎవరికీ తలవంచని అతడి కథేమిటో తెలియాలంటే  ‘ఈటి... ఎవరికీ తలవంచడు’ చూడాల్సిందే. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక మోహన్‌ కథానాయిక. పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రై.లి.సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాని మార్చి 10న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని శనివారం ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘ఎదురే తిరగడా... నిప్పులు చెరగడా... శత్రువు గుండెలో దడ దడ దడా...’ అంటూ పాట వినిపిస్తుండగా, సూర్య చేసే పోరాట ఘట్టాలు టీజర్‌కి ఆకర్షణగా నిలిచాయి. సూర్య మాస్‌ పాత్రలో సందడి చేస్తున్నారు. వినయ్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా నటించారు. సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, శరణ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని