ఈమెయిల్స్‌ వల్ల పర్యావరణం దెబ్బతింటోంది!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘పూరీ మ్యూజింగ్స్‌’లో సరికొత్త అంశం గురించి ప్రస్తావించారు. చాలా మందికి తెలియని ‘ఈమెయిల్స్‌’ వెనుక కథను వివరించారు. డిలీట్‌ చేయకుండా ఉంచే ఈమెయిల్స్‌ వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోందని, రోజూ నిద్రపోవడానికి ముందు వాటిని డిలీట్‌ చేయమని కోరారు.....

Published : 18 Oct 2020 02:54 IST

పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘పూరీ మ్యూజింగ్స్‌’లో సరికొత్త అంశం గురించి ప్రస్తావించారు. చాలా మందికి తెలియని ‘ఈమెయిల్స్‌’ వెనుక కథను వివరించారు. డిలీట్‌ చేయకుండా ఉంచే ఈమెయిల్స్‌ వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోందని, రోజూ నిద్రపోవడానికి ముందు వాటిని డిలీట్‌ చేయమని కోరారు.

‘మీ అందరికీ ఈ-మెయిల్‌ ఐడీలు ఉంటాయి. రోజూ మీ మెయిల్‌ బాక్స్‌కు వందల ఈ-మెయిల్స్‌‌ వస్తుంటాయి. అందులో 99 శాతం అవసరం లేనివే. ఇలా వేల ఈ-మెయిల్స్‌ను మీరు డిలీట్‌ చేయకపోవడం వల్ల మన పర్యావరణం దెబ్బతింటోందని నేనంటే.. ‘దానికి, దీనికి సంబంధం ఏంటి?’ అని మీకు కోపం వస్తుంది. మీ ఇన్‌బాక్స్‌లో వేల సందేశాలు ఉన్నాయంటే? ఎవరో, ఎక్కడో భద్రపరిచారని అర్థం. మీ ఈమెయిల్స్‌ను మల్టిపుల్‌ సర్వర్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా స్టోర్‌ చేస్తారు. దీని కోసం పెద్ద పెద్ద డేటా సెంటర్‌లు ఉంటాయి. వీటి వల్ల కార్బన్‌ ఉత్పత్తి అవుతుంది. సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల వల్ల విపరీతమైన కార్బన్‌ ఉత్పత్తవుతోంది. ఆ చెత్తను మనం అనవసరంగా దాస్తుంటాం. ఒక ఈమెయిల్‌ వల్ల .3 గ్రాముల కార్బన్‌ బయటికి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఫేక్‌ ఈమెయిల్స్‌ ఉంటాయి. మీరు బద్ధకంతో ఈమెయిల్స్‌ డిలీట్‌ చేయకపోతే ఎంతో నష్టం జరుగుతోంది. రోజూ రాత్రి మీకు అవసరం లేని ఈమెయిల్స్‌ డిలీట్‌ చేసి, పడుకోండి. దయచేసి ఈ ఒక్క పని చేయండి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడండి..’ అని పూరీ పేర్కొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని