‘ఆహా’లో ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్‌

ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా మలయాళంలో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద

Updated : 15 Jul 2021 11:49 IST

హైదరాబాద్‌: మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్‌లలో సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలకు నోచుకోని పలు చిత్రాలతో పాటు, ఇతర భాషల్లోని చిత్రాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 7న ‘ట్రాన్స్‌’ స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు, నటుడు గౌతమ్‌ మేనన్‌ ‘ట్రాన్స్‌’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నజ్రియా నజీమ్‌, గౌతమ్‌ మేనన్‌, చంబన్‌ వినోద్‌ జోసీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని