
సామ్.. చైకి విడాకులు ఇచ్చేయ్..!
నటి రిప్లైతో నెటిజన్లు ఫిదా
హైదరాబాద్: తన అందం, అభినయంతో రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో సైతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్రకథానాయిక సమంత. వివాహబంధంలోకి అడుగుపెట్టినప్పటికీ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదనడంలో ఆశ్చర్యం లేదు. తన భర్తపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ తరచూ సమంత ఇన్‌స్టా వేదికగా పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే ఇటీవల ఓ నెటిజన్.. చైతన్యకు విడాకులు ఇచ్చేయమంటూ పెట్టిన కామెంట్‌పై తాజాగా సామ్ స్పందించారు. ఆమె ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తన ఫిట్నెస్, ఫీలింగ్స్ గురించి తెలియజేస్తూ ఇటీవల సమంత ఇన్‌స్టా వేదికగా పలు ఫొటోలు షేర్ చేశారు. ఆమె పెట్టిన ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘వావ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం కొంచెం విభిన్నంగా స్పందించాడు. ‘చైకి విడాకులు ఇచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అని కామెంట్ చేశాడు. సదరు నెటిజన్ కామెంట్ చూసిన సమంత తాజాగా స్పందించారు. ‘అది చాలా కష్టం (చైకి విడాకులు ఇవ్వలేను అనే ఉద్దేశంలో)’ అని రిప్లై ఇచ్చారు. అయితే సామ్ ఇచ్చిన రిప్లైతో ఆమెకి చై అంటే ఎంత ఇష్టమో మరోసారి చెప్పకనే చెప్పారు అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
2010లో విడుదలైన ‘ఏమాయ చేసావె’ సినిమా కోసం సమంత-చైతన్య మొదటిసారి కలిసి పనిచేశారు. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొన్నేళ్ల ప్రేమ అనంతరం 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు సమంత సినిమాలతోపాటు ‘సామ్ జామ్’ అనే ప్రత్యేక కార్యక్రమంతో ‘ఆహా’ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.