మాకు అనుష్కే కావాలి..!

అందం, అభినయంతోపాటు నటనలోని రాజసంతో ఎంతో మంది సినీ ప్రియుల మదిని గెలుచుకున్నారు అగ్ర కథానాయిక అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘దేవసేన’.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పాత్రలు ఆమెలోని నటికి అద్దం పడతాయి. అయితే తాజాగా ప్రకటించిన ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంలో...

Updated : 10 Oct 2020 11:33 IST

దర్శకుడికి సందేశాలు పంపుతున్న అభిమానులు

హైదరాబాద్‌: అందం, అభినయంతోపాటు నటనలోని రాజసంతో ఎంతో మంది సినీ ప్రియుల మదిని గెలుచుకున్నారు అగ్ర కథానాయిక అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘దేవసేన’.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పాత్రలు ఆమెలోని నటనకి అద్దం పడతాయి. అయితే తాజాగా ప్రకటించిన ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంలో అనుష్కను కథానాయికగా తీసుకోవాలని కోరుతూ అభిమానులు సదరు చిత్ర దర్శకుడికి వరుస సందేశాలు పంపిస్తున్నారు. చిన్న విరామానంతరం గుణశేఖర్‌ తెరకెక్కించనున్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు గుణశేఖర్‌ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ మేరకు ‘శాకుంతలం’ మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

కాగా, గుణశేఖర్‌ షేర్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌కి సినీ ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని కోరుతూ ఎంతో మంది సినీ ప్రియులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘గుణశేఖర్‌ సర్‌.. దయచేసి అనుష్కను హీరోయిన్‌గా తీసుకోండి’, ‘ఈ ప్రేమకథా చిత్రానికి అనుష్క చక్కగా నప్పుతుంది.’, ‘ఈ కథకి మా క్వీన్‌ సరిపోతుంది.’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకారం తెలపాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు నటించనున్నారనే విషయంలో చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత అనుష్క తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని