మా దగ్గర ‘కేశవ్‌’ లేరు..!

ఇటీవల మృతి చెందిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ దగ్గర పనిచేసిన ‘కేశవ్‌’ అనే వ్యక్తిని నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ కొన్నిరోజుల క్రితం తన దగ్గర పనిలో పెట్టుకున్నారని పలు ఆంగ్ల ప్రసార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సుశాంత్‌ దగ్గర పనిచేసిన మరో వ్యక్తికి...

Published : 02 Oct 2020 11:54 IST

ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు

ముంబయి: ఇటీవల మృతి చెందిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ దగ్గర పనిచేసిన ‘కేశవ్‌’ అనే వ్యక్తిని నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ కొన్నిరోజుల క్రితం తన దగ్గర పనిలో పెట్టుకున్నారని పలు ఆంగ్ల ప్రసార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సుశాంత్‌ దగ్గర పనిచేసిన మరో వ్యక్తికి సారా అలీఖాన్‌ సైతం ఇటీవల తన నివాసంలో పని ఇచ్చారంటూ సోషల్‌మీడియాలో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై ఫర్హాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లు పెట్టారు. ‘మా దగ్గర కేశవ్‌ అనే పేరుతో ఏ వ్యక్తీ పనిచేయడం లేదు. పలు వెబ్‌సైట్లు, ఆంగ్ల పత్రికల్లో వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. కొంతమంది కావాలనే ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయండి’ అని ఫర్హాన్‌ పేర్కొన్నారు.

కాలిఫోర్నియాలో సుశాంత్‌ కోసం..

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, సత్వర న్యాయం జరగాలని కోరుతూ కాలిఫోర్నియాలోని కొంతమంది భారతీయులు ప్లకార్డ్స్‌తో ప్రదర్శన నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోని సదరు నటుడి సోదరి శ్వేతాసింగ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని