చిరు నాతోనే ఉన్నట్లుంది: హీరో తమ్ముడు

ఇటీవల అకాలమరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన గురువారం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సర్జా కుటుంబానికి ఎంతో సంతోషకరమైన ఈ విషయం గురించి తాజాగా నటుడు ధ్రువ(చిరు సర్జా సోదరుడు) స్పందించారు. మొదటిసారి బాబుని చేతుల్లోకి తీసుకోగానే ఎంతో ఆనందంగా అనిపించిందని...

Published : 24 Oct 2020 02:06 IST

బెంగళూరు: ఇటీవల అకాలమరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన గురువారం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సర్జా కుటుంబానికి ఎంతో సంతోషకరమైన ఈ విషయం గురించి తాజాగా నటుడు ధ్రువ(చిరు సర్జా సోదరుడు) స్పందించారు. ‘బాబు రాకతో మా కుటుంబంలో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. మేఘన, బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. హనుమాన్‌కి కృతజ్ఞతలు. బాబుని చేతుల్లోకి తీసుకోగానే అన్నయ్య నాతోనే ఉన్నట్లనిపించింది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను’ అని ధ్రువ అన్నారు.

‘‘పుట్టబోయే చిన్నారి గురించి ఈ ఏడాది వేసవిలో చిరు, నేనూ సరదాగా మాట్లాడుకున్నాం. ‘నీలాగే బాబు పుడితే నీ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది’ అని అడిగాను. దానికి చిరు.. ‘స్కూల్‌లో చదువుతున్నప్పుడు నాపై ఎన్నో కంప్లైట్స్‌ వచ్చేవి. దీంతో అమ్మవాళ్లు చాలాసార్లు స్కూల్‌కి వచ్చారు. ఒకవేళ నాకు నాలాంటి బాబు పుడితే.. తప్పకుండా వాడి గురించి ప్రతిరోజూ ఎన్నో కంప్లైట్స్‌ వింటా’ అని చెప్పాడు’’ అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ధ్రువ ఎమోషనలయ్యారు. నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరు సర్జా ఈ ఏడాది జూన్‌ 7న గుండెపోటుతో మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని