Updated : 21 Mar 2022 12:43 IST

Dasara: ‘దసరా’ మెరుపు

నాని కథానాయకుడిగా కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌ కథా నాయిక. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆదివారం ఈ సినిమా నుంచి నాని ఫస్ట్‌లుక్‌తో పాటు ‘స్పార్క్‌ ఆఫ్‌ దసరా’ పేరుతో చిన్న వీడియో గ్లింప్స్‌ విడుదల చేశారు. ప్రచార చిత్రంలో నాని ఊరమాస్‌ లుక్‌లో కనిపించారు. మండుతున్న ఓపెన్‌ క్వారీలో టిప్పర్‌లలో బొగ్గు లోడ్‌ చేస్తున్న సన్నివేశంతో ప్రచార చిత్రం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇందులో నాని  గల్ల లుంగీ.. ఎర్ర చొక్కా ధరించి.. మండుతున్న బొగ్గుతో బీడీ అంటించుకొని.. గంభీరంగా నడిచొస్తూ కనిపించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ధరణి. ‘‘గోదావరిఖనిలోని సింగరేణి కోల్‌మైన్స్‌కు దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో జరిగే కథ ఇది. నాని మాస్‌ - యాక్షన్‌ ప్యాక్డ్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పక్కా తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని