Nikhil: పుట్టినరోజున మరో పేజీ

కరోనా పరిస్థితులతో అవస్థలు పడుతున్న ఎంతోమందికి చేయూత అందిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు నిఖిల్‌. ఆయన  కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమే... ‘18 పేజీస్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. పల్నాటి సూర్య   ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 27 May 2021 06:04 IST

రోనా పరిస్థితులతో అవస్థలు పడుతున్న ఎంతోమందికి చేయూత అందిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు నిఖిల్‌. ఆయన  కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమే... ‘18 పేజీస్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. పల్నాటి సూర్య   ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. ప్రముఖ దర్శకుడు    సుకుమార్‌ సమకూర్చిన కథతో... జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ రూపొందిస్తున్నాయి. జూన్‌ 1న కథానాయకుడు నిఖిల్‌ పుట్టినరోజు. ఆ సందర్భంగా అదే రోజున ‘18 పేజీస్‌’ లుక్‌ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘‘సుకుమార్‌ అందించిన మరో భిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. పేరు ప్రకటించగానే అనూహ్యమైన స్పందన లభించింది. ‘కుమారి 21 ఎఫ్‌’తో ఘన విజయాన్ని అందుకున్న సూర్యప్రతాప్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న తీరు చాలా బాగుంది. నిఖిల్‌ - అనుపమ జోడీ అలరిస్తుంది. గోపీ  సుందర్‌ స్వరాలు చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వసంత్‌, కూర్పు: నవీన్‌ నూలి, రచన: శ్రీకాంత్‌ విస్సా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని