నలుగురు దర్శకులు.. 4 ప్రేమకథలు

నాలుగు విభిన్నమైన ప్రేమకథలు.. నలుగురు ప్రముఖ దర్శకులతో ఓ వైవిధ్యభరిత వెబ్‌సిరీస్‌  తెరకెక్కుతోంది. ‘కుట్టి లవ్‌స్టోరీ’ పేరుతో

Published : 03 Sep 2020 10:26 IST

హైదరాబాద్‌: నాలుగు విభిన్నమైన ప్రేమకథలు.. నలుగురు ప్రముఖ దర్శకులతో ఓ వైవిధ్యభరిత వెబ్‌సిరీస్‌  తెరకెక్కుతోంది. ‘కుట్టి లవ్‌స్టోరీ’ పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌ను వేల్స్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. నాలుగు భిన్నమైన ప్రేమ కథాంశాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టీజర్‌లో తెలియజేశారు.

ప్రముఖ  దర్శకులు గౌతమ్‌ మేనన్‌, వెంకట్‌ ప్రభు, విజయ్‌, నలన్‌ కుమారస్వామి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 30నిమిషాల నిడివితో ఉండే ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం  చిత్రీకరణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు కథల్లో నటిస్తున్న నటీనటులెవరన్నది తెలియ    రాలేదు. ఈ సిరీస్‌ను త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని