Published : 03 Nov 2020 14:23 IST

ఏడేళ్ల స్నేహం.. మూడేళ్ల ప్రేమ..: కాజల్‌

లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు పెళ్లి...

ముంబయి: అగ్ర కథానాయిక కాజల్‌ తన భర్త గౌతమ్‌ కిచ్లుతో ప్రేమ, పెళ్లి గురించి ఎట్టకేలకు బయటపెట్టారు. అక్టోబరు 30న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె పెళ్లి తర్వాత ప్రముఖ మ్యాగజైన్‌ ‘వోగ్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గౌతమ్‌తో బంధం, కరోనా సమయంలో పెళ్లి తదితర విషయాల గురించి ముచ్చటించారు. గత ఏడేళ్లుగా గౌతమ్ తెలుసని, కానీ లాక్‌డౌన్‌ తమ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకొచ్చేలా చేసిందని కాజల్‌ పేర్కొన్నారు.

‘గత మూడేళ్లుగా నేను, గౌతమ్‌ డేటింగ్‌లో ఉన్నాం, ఏడేళ్లుగా మేం స్నేహితులం. ఒకరి జీవితంలో మరొకరి ప్రాధాన్యత రోజురోజుకీ పెరిగింది. ఇద్దరం వివిధ పార్టీల్లో, ముఖ్యమైన సమావేశాల్లో కలుసుకునేవాళ్లం. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని వారాలపాటు ఒకర్నొకరం చూసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. మాస్కులు ధరించి సరకులు కొనడానికి వెళ్లినప్పుడు కలుసుకున్నాం. ఇద్దరం కలిసి జీవించాలనే విషయం అప్పుడే మాకు అర్థమైంది’.

‘రొమాన్స్‌ విషయానికి వస్తే గౌతమ్‌ నాటకీయంగా వ్యవహరించే వ్యక్తి కాదు. సినిమాలో హీరోలా ప్రవర్తించడు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అలాంటి రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించా. గౌతమ్‌ సున్నితంగా ప్రపోజ్‌ చేసిన విధానం నా మనసును తాకింది. ఆరోజు ఇద్దరం భావోద్వేగానికి గురయ్యాం.. చాలా సేపు మాట్లాడుకున్నాం. గౌతమ్‌ తన భవిష్యత్తులో నేను ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడో తెలిపిన తీరు హృదయాన్ని కదిలించింది. గౌతమ్‌ తన ఫీలింగ్స్‌ విషయంలో చాలా ప్రామాణికంగా ఉంటాడు’ అని కాజల్‌ పేర్కొన్నారు.

జూన్‌ నెలలో కాజల్‌-గౌతమ్‌ నిశ్చితార్థం జరిగింది. అక్టోబరు 29న మెహెందీ, హల్దీ వేడుకలు ఇంట్లోనే జరిగాయి. 30న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ముంబయి తాజ్‌ హోటల్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమకు దక్షిణాదితో అనుబంధం ఉందని, అందుకే జీలకర్ర-బెల్లంతో వివాహ తంతు జరిపించామని కాజల్‌ పేర్కొన్నారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని