God Father: ముంబయిలో.. చిత్రీకరణ

హిందీ తారలు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. భాషల మధ్య హద్దులు చెరిగిపోవడమే అందుకు కారణం. ఏ నటుడు ఏ భాషలో నటించినా... ఆ సినిమా అందరికీ చేరువవుతోన్న సమయం ఇది. బాలీవుడ్‌ తార సల్మాన్‌ఖాన్‌

Updated : 15 Mar 2022 11:58 IST

హిందీ తారలు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. భాషల మధ్య హద్దులు చెరిగిపోవడమే అందుకు కారణం. ఏ నటుడు ఏ భాషలో నటించినా... ఆ సినిమా అందరికీ చేరువవుతోన్న సమయం ఇది. బాలీవుడ్‌ తార సల్మాన్‌ఖాన్‌ తెలుగు తెరపై సందడి చేయనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో సల్మాన్‌ ఓ అతిథి పాత్రని పోషిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం ముంబయిలో మొదలైంది. ఓ స్టూడియోలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్‌  పోషించిన పాత్రని తెలుగులో సల్మాన్‌ఖాన్‌ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవికీ, సల్మాన్‌ఖాన్‌కీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహ బంధం ఉంది. దాంతో సల్మాన్‌ని సంప్రదించగానే ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరో అతిథిగా రవితేజ

చిరంజీవి 154వ చిత్రంలోనూ ఓ కీలకమైన అతిథి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం మరో కథానాయకుడు రవితేజని ఎంపిక  చేసినట్టు సమాచారం. మాస్‌ కథతో... బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. చిరుకి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ వచ్చే నెల నుంచే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సమాచారం. చిరంజీవి సినిమాల్లో రవితేజ ఇదివరకు నటించారు. ఇది విశాఖ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని