నాన్న మమ్మల్ని అలా పెంచారు: నాగబాబు
పిల్లల్ని తల్లిదండ్రులు సంవత్సరంలో ఒక్కసారైనా విహారయాత్రకు తీసుకెళ్లాలని.. ఆ విషయంలో తాను కొంత విఫలమయ్యానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అలా తీసుకెళ్లినప్పుడే వాళ్లలోని నైపుణ్యం మనకు తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా వాళ్ల నాన్న.. నాగబాబుతో పాటు ఆయన సోదరులను
హైదరాబాద్: పిల్లల్ని తల్లిదండ్రులు సంవత్సరంలో ఒక్కసారైనా విహార యాత్రకు తీసుకెళ్లాలని.. ఆ విషయంలో తాను కొంత విఫలమయ్యానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అలా తీసుకెళ్లినప్పుడే వాళ్లలోని నైపుణ్యం మనకు తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి.. తమను పెంచే విషయంలో వ్యవహరించిన విధానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఈతరం తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి కూడా ఆయన పలు సూచనలు చేశారు.
‘‘మేం పరీక్షల్లో ఫెయిల్ అయినా.. పాస్ అయినా.. మా ఇంట్లో ఏం అనేవాళ్లు కాదు. కాకపోతే.. పాస్ అయితే చాలు అనేవారు. ఎంతో మద్దతు ఇచ్చేవాళ్లు. మా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఎక్సైజ్ డిపార్టుమెంట్లో పనిచేసే మా నాన్నకు ఎంతో లోకజ్ఞానం ఉండేది. మా కోరికలు, ఆలోచనలను గౌరవిస్తూనే.. మార్గ నిర్దేశనం చేసేవారు. మా అన్నయ్య సినిమాల్లోకి వచ్చే విషయంలోనూ ఆయన ఎంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా జీవితంలో స్థిరపడటానికి, నిర్మాతగా మారడానికి మా అన్నయ్యే ముఖ్య కారణం. కానీ.. ‘నువ్వు స్వతంత్రంగా ఎదగాలి’ అని చెప్పేవారు. అలాగే మా తమ్ముడికి కూడా కెరీర్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మేం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆయన మా నిర్ణయానికి వదిలేస్తూనే.. ప్లాన్-ఏ తో పాటు ప్లాన్-బీ కూడా ఇచ్చేవారు’ అని నాగబాబు గుర్తు చేసుకున్నారు.
‘‘పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలి. మా కాలంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. మాకు, మా పిల్లలకు దొరికినంత స్వేచ్ఛ.. వాళ్ల పిల్లలకు దొరకడం లేదు. మన భయాలు, ఆలోచనలు వాళ్ల స్వేచ్ఛకు ఆటంకం కాకూడదు. ఎండలో ఆడకూడదు.. వర్షంలో తడవకూడదు.. ఇలాంటివన్నీ పిచ్చి మాటలు. వాళ్లను ప్రకృతిని ఆస్వాదించనివ్వాలి. పిల్లల్ని మరీ సున్నితంగా పెంచకూడదు. పిల్లల్ని కొంచెమైనా రఫ్‌గా పెంచాలి. ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు నేర్పించాలి. ఒక తండ్రి అనే వాడు.. పిల్లలతో రోజుకు కనీసం గంటసేపైనా సమయం గడపాలి. తల్లి ఎలాగూ కావాల్సినంత సమయం కేటాయిస్తుంది. వారాంతాల్లో కనీసం ఒకరోజులో సగమైనా వాళ్లతో ఉండాలి. అప్పుడే వాళ్ల ఆలోచనలు, సామర్థ్యాలు తెలుస్తాయి’ అని నాగబాబు తెలిపారు.
ఇదీ చదవండి..
వరుణ్, నిహారిక విషయంలో నా తప్పు అదే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్