రండి.. గుంటూరుతో ప్రేమలో పడండి

‘రండి.. గుంటూరు నగరంతో ప్రేమలో పడండి’ అని అంటున్నారు నటుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొలమ్మ కథానాయిక. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 20న అమెజాన్‌...

Published : 09 Nov 2020 15:03 IST

హైదరాబాద్‌: ‘రండి.. గుంటూరు నగరంతో ప్రేమలో పడండి’ అని అంటున్నారు నటుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొలమ్మ కథానాయిక. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 20న అమెజాన్‌ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది.

తాజాగా ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రం నుంచి ‘గుంటూరు’ అంటే సాగే పాటను చిత్రబృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. గుంటూరు నగరాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని తెలియజేస్తూ ఈ పాటను రచించారు. అంతేకాకుండా గుంటూరులోని పలు ప్రాంతాల్లో దొరికే పసందైన వంటకాల గురించి కూడా ఈ పాట ద్వారా తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు