Hanuman: రోజూ 8 గంటలు... తాడుపైనే!

సూపర్‌ హీరో అనగానే రకరకాల  విన్యాసాలే గుర్తుకొస్తాయి. ప్రేక్షకుల్ని అడుగడుగునా అబ్బుర పరిచే ఆ విన్యాసాల్ని తెరకెక్కించడం వెనక ఉండే వ్యయ ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. ‘హను - మాన్‌’ చిత్రబృందం వాటన్నిటినీ ఓ...

Updated : 18 Mar 2022 09:07 IST

సూపర్‌ హీరో అనగానే రకరకాల  విన్యాసాలే గుర్తుకొస్తాయి. ప్రేక్షకుల్ని అడుగడుగునా అబ్బుర పరిచే ఆ విన్యాసాల్ని తెరకెక్కించడం వెనక ఉండే వ్యయ ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. ‘హను - మాన్‌’ చిత్రబృందం వాటన్నిటినీ ఓ సవాల్‌గా తీసుకుని వంద రోజులుగా చిత్రీకరణ చేస్తోంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  వందో రోజు చిత్రీకరణ పూర్తి చేసుకున్న   సందర్భంగా చిత్రబృందం ఓ ప్రకటనని విడుదల చేసింది. ‘‘అత్యున్నత సాంకేతికతతో రూపొందిస్తున్న చిత్రమిది. సూపర్‌ హీరోగా తేజ సజ్జా నటిస్తున్నారు. ఇందులో క్లిష్టమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటికోసం తేజ ఎలాంటి డూప్‌ లేకుండా నటిస్తున్నారు. రోజూ 8 గంటలపాటు తాడుపైనే ఉంటూ చిత్రీకరణలో పాల్గొన్నారు. అలా చాలా రోజులే చిత్రీకరణ చేశాం. ఆ క్రమంలో గాయాలు సర్వసాధారణం. సీనియర్‌ నటులతోపాటు, సాంకేతిక బృందం చక్కటి సహకారం అందిస్తోంది. తప్పనిసరిగా ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన అనుభూతిని పంచే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని పేర్కొన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో మెరుస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌ దేవ్‌, హరి గౌరా, జై క్రిష్‌, కృష్ణ సౌరభ్‌, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌ విల్లే, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సమర్పణ: చైతన్య.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు