PelliSandaD: బుజ్జులు.. బుజ్జులు

‘‘బుజ్జులు.. బుజ్జులు.. బుజ్జులు.. కొని పెడతా బంగారు గజ్జెలు’’ అంటూ అలక పాన్పునెక్కిన ప్రేయసిని పాటతో బుజ్జగిస్తున్నాడు రోషన్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా

Updated : 24 May 2021 08:39 IST

‘‘బుజ్జులు.. బుజ్జులు.. బుజ్జులు.. కొని పెడతా బంగారు గజ్జెలు’’ అంటూ అలక పాన్పునెక్కిన ప్రేయసిని పాటతో బుజ్జగిస్తున్నాడు రోషన్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లి సందదీ’. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఆదివారం రాఘవేంద్రరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘బుజ్జులు బుజ్జులు’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ గీతానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. బాబా సెహ్‌గల్‌, మంగ్లీ ఆలపించారు. ఈ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావు సర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ‘బుజ్జులు’ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. దర్శకురాలిగా నాకిదొక ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. దీంట్లోని ప్రతి పాట ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఏడు రోజుల చిన్న ప్యాచ్‌ వర్క్‌ మినహా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. లాక్‌డౌన్‌ ముగిశాక ఆ మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. ఈ సినిమాకి  ఛాయాగ్రహణం: సునీల్‌ కుమార్‌ నామ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని