నాన్న నా కోసం డబ్బులు పెట్టలేదు!

‘చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ’.. ఈ మాటను అనేక ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. సినీ నేపథ్యం ఉన్న వారికి ఇక్కడ కెరీర్‌ సజావుగా ఉంటుందంటూ అనేక మంది కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుమారుడు అభిషేక్‌ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు....

Published : 08 Nov 2020 09:32 IST

నేనే ఆయన చిత్రం నిర్మించా: అభిషేక్‌ బచ్చన్‌

ముంబయి: ‘చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ’.. ఈ మాటను అనేక ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. సినీ నేపథ్యం ఉన్న వారికి ఇక్కడ కెరీర్‌ సజావుగా ఉంటుందంటూ అనేక మంది కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుమారుడు అభిషేక్‌ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన అభివృద్ధి కోసం అభిషేక్‌ తండ్రి సాయం తీసుకున్నారని కూడా చెప్పుకొన్నారు. అయితే ఇన్నాళ్లూ వీటిని పట్టించుకోని అభిషేక్ తొలిసారి బంధుప్రీతి గురించి మాట్లాడారు. తను కెరీర్‌లో ఎదగడం కోసం అమితాబ్‌ ఏ రోజూ సాయం చేయలేదని, డబ్బులు పెట్టలేదని స్పష్టం చేశారు. తానే అమితాబ్‌ నటించిన ‘పా’ను నిర్మించినట్లు చెప్పారు. ‘నాన్న ఎవరి ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్‌ చేయరు. నా కోసం ఎప్పుడూ సినిమాను నిర్మించలేదు. కానీ నేను ఆయన కోసం ‘పా’ సినిమాను నిర్మించా’ అని ఆయన పేర్కొన్నారు. ‘పా’ సినిమాకు ఆర్‌. బాల్కీ దర్శకత్వం వహించారు. 2009లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్‌తోపాటు అభిషేక్‌, విద్యా బాలన్‌ కూడా నటించారు. బిగ్‌బి ఈ సినిమాలో జన్యుపరమైన లోపం ఉన్న అబ్బాయిగా కనిపించారు. అభిషేక్‌ ఆయన తండ్రి పాత్రను, విద్య తల్లి పాత్రను పోషించారు.

కర్వా చౌత్‌ సందర్భంగా తన సతీమణి ఐశ్వర్యరాయ్‌ కోసం ఉపవాసం ఉన్నానని అభిషేక్‌ చెప్పారు. ‘మేమిద్దరం ఆ రోజు చాలా బిజీగా ఉన్నాం. సాయంత్రం వేళ ఇంట్లో ఉన్న మహిళలు పూజ చేశారు. రాత్రి చందమామ కోసం ఎదురుచూశారు. పూజ అనంతరం భోజనం చేశాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని