అమ్మానాన్నకు మాటిచ్చా: సోనూసూద్‌

ప్రజల ప్రేమ, నమ్మకాన్ని మోసేంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తనకే తెలియదని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. తన తల్లితండ్రులు గర్వపడేలా చేస్తానని వాళ్లకు ఎప్పుడో మాటిచ్చానని ఆయన అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోనూసూద్‌ను పంజాబ్‌ ఎన్నికల ఐకాన్‌గా

Updated : 19 Nov 2020 17:32 IST

ముంబయి: ప్రజల ప్రేమ, నమ్మకాన్ని మోసేంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తనకే తెలియదని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. తన అమ్మానాన్న గర్వపడేలా చేస్తానని వాళ్లకు ఎప్పుడో మాటిచ్చానని ఆయన అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోనూసూద్‌ను పంజాబ్‌ ఎన్నికల ఐకాన్‌గా గుర్తించిన తర్వాత ఆయన తొలిసారిగా తన అమ్మానాన్న గురించి మాట్లాడారు. వాళ్లను ఎంతగానో మిస్సవుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. 2016లో తండ్రిని, 2008లో తల్లిని కోల్పోయారు సోనూ.

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘మా స్వస్థలం పంజాబ్‌లోని ‘మోగా’లో మీబిడ్డ గురించి గొప్పగా చర్చించుకునేలా చేస్తానని మా తల్లిదండ్రులకు చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు దక్కిన ఈ ఆదరణ అమ్మానాన్న ఆశీర్వాద ఫలమే’’ అని సోనూసూద్‌ అన్నారు. పంజాబ్‌ ఎన్నికల సంఘం ఐకాన్‌గా ప్రభుత్వం గుర్తించడంపై సోనూ మాట్లాడుతూ.. ఇప్పుడు అమ్మానాన్న తనను చూసి ఎంతో సంతోషిస్తుంటారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నిజానికి ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను నేను మోయగలననే విశ్వసిస్తున్నాను. ఇంతమంది ప్రేమ, అభిమానాలు భరించే శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకే తెలియదు. కానీ.. తనలో బలం, ధైర్యం ఉన్నంతకాలం ఎంతటి బాధ్యతనైనా మోస్తాను. అయితే.. ప్రజలను నన్ను నమ్మారు. అందుకే వాళ్ల నమ్మాకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని సోనూసూద్‌ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయిది. అన్నిరకాల రంగాలు తీవ్ర నష్టాలను చవి చూశాయి. ముఖ్యంగా వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. చాలామంది తిండిలేక ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితుల్లో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. విదేశాల్లో చిక్కుకున్న కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేయించాడు. ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థులు, నిరుపేదలు, అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నవారు ఇలా.. ఎంతోమందికి ఆయన సాయం చేసి ఆపద్బాంధవుడయ్యారు. దీంతో సోనూసూద్‌ ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిపోయారు. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts