బాలు.. నువ్వు నా మాట వినలేదు: ఇళయరాజా

తన ప్రాణ మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. ‘బాలు.. నీ కోసం నేను ఎదురుచూస్తుంటానని....

Published : 26 Sep 2020 01:09 IST

భావోద్వేగంతో సంగీత దర్శకుడు

చెన్నై: తన ప్రాణ మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. ‘బాలు.. నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని, త్వరగా తిరిగి రమ్మని నీకు చెప్పా. కానీ నువ్వు నా మాటలు వినలేదు, వెళ్లిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్లావు?, ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ నేను చూడలేను. నాకు మాటలు రావడం లేదు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఏ దుఖాఃనికైనా ఓ పరిమితి ఉంటుంది, కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు..’ అని ఆయన భావాల్ని వ్యక్తం చేశారు.

బాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇళయరాజా వీడియో విడుదల చేశారు. త్వరగా కోలుకుని రమ్మని అడిగారు. ‘మన స్నేహం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. అది ఇక్కడితో ముగిసిపోదు. సంగీతం మన జీవితం.. జీవితమే సంగీతం.. మన స్నేహాన్ని, ప్రేమను ఎవరూ వేరు చేయలేరు. నువ్వు కోలుకుంటావని నా మనసు చెబుతోంది. నీ కోసం దేవుడ్ని ప్రార్థిస్తాను. త్వరగా వచ్చేయ్‌ బాలూ..’ అని అప్పట్లో ఇళయరాజా పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని