Aliabhatt: చిన్నప్పుడే రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నా!

అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ప్రతిసారీ వినిపిస్తూనే ఉంటుంది. ఫలానా తేదీ అంటూ వార్తలొస్తూనే ఉన్నాయి. ఇదే ప్రశ్న అలియాను చాలా మంది అభిమానులు చాలాసార్లు అడుగుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘గంగూబాయి కాఠీయావాడీ’

Updated : 25 Feb 2022 08:32 IST

అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ప్రతిసారీ వినిపిస్తూనే ఉంటుంది. ఫలానా తేదీ అంటూ వార్తలొస్తూనే ఉన్నాయి. ఇదే ప్రశ్న అలియాను చాలా మంది అభిమానులు చాలాసార్లు అడుగుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘గంగూబాయి కాఠీయావాడీ’ ఈ రోజు  ప్రేక్షకుల ముందుకొస్తోందీ. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇదే ప్రశ్న అలియాకు మరోసారి ఎదురైంది. దానికి ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ‘‘మీ పెళ్లి ఎప్పుడు? అంటూ పదే పదే అడుగుతున్నారు. ఇది ఎవరికీ సంబంధించిన విషయం కాదు. నా వ్యక్తిగత విషయం. పెళ్లి అనేది మనసుకు సంబంధించిన   వ్యవహారం. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి జరిగేది. ప్రస్తుతం నా మనసు ప్రశాంతంగానే ఉంది. నా ఇష్టం.. రణ్‌బీర్‌ ఇష్టాలకు అనుగుణంగా ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే పెళ్లి జరుగుతుంది. నిజం చెప్పాలంటే రణ్‌బీర్‌తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నా చిన్నవయసులోనే రణ్‌బీర్‌ని తొలిసారి వెండితెరపై చూసినప్పుడే అతణ్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది’’అని చెప్పింది అలియా. చాలా వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి సందడి చేస్తున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని