ఎంతోమంది తిరస్కరించారు..: స్టార్‌ సింగర్‌

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్‌ సింగర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కైలాశ్‌ ఖేర్‌. సంగీతం పట్ల ఆయన చూపిస్తున్న చొరవకు 2017లో పద్మశ్రీ పురస్కరాన్ని అందించి కేంద్రప్రభుత్వం సత్కరించింది. గాయకుడిగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన ఆయన...

Published : 01 Dec 2020 01:32 IST

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..!

ముంబయి: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్‌ సింగర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కైలాశ్‌ ఖేర్‌. సంగీతం పట్ల ఆయన చూపిస్తున్న చొరవకు 2017లో పద్మశ్రీ పురస్కరాన్ని అందించి కేంద్రప్రభుత్వం సత్కరించింది. గాయకుడిగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన ఆయన తాజాగా తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయికు వచ్చిన కొత్తలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కొంతమంది తనను తిరస్కరించారని చెప్పారు.

‘‘జీవితంలో నాకు స్ఫూర్తి ఎవరూ లేరు. ముంబయి వచ్చిన కొత్తలో వృత్తిపరంగా నన్ను ఎంతోమంది రిజెక్ట్‌ చేశారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. మరెన్నో కోల్పొయాను. ఒకానొక సమయంలో కోల్పొవడానికి నా దగ్గర ఏమీ లేదు. చనిపోవాలనుకున్నా. ఆ క్షణమే నాకు స్ఫూర్తిగా మారింది. అప్పుడే నిర్ణయించుకున్నా కచ్చితంగా ఏదైనా సాధించాలని. వృత్తిపరంగా నీకెంత అనుభవం ఉన్నా.. నువ్వు ఎంత నేర్చుకున్నా.. ఇండస్ట్రీలో నిన్ను ఎవరూ గైడ్‌ చేయరు. కృతజ్ఞతలేని వాళ్లు, క్రూరమైన వాళ్లు ఇక్కడ ఉంటారని తెలిసింది. వాళ్లలా నేను ఉండకూడదని నిర్ణయించుకున్నా. టాలెంట్‌ ఉన్న నూతన గాయనీ గాయకులకు సాయం  చేయాలనుకున్నా. అలా ప్రతి ఏటా కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకి అన్ని రకాలుగా ట్రైనింగ్‌ ఇస్తున్నా’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైలాష్‌ ఖేర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని