భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య జరగాల్సిన ఈ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి..........

Published : 24 Sep 2020 15:42 IST

దిల్లీ: భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో జరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ వెల్లడించారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు పేర్కొన్నారు. కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 జనవరి 16 నుంచి 24 తేదీల్లో గోవాలో అన్ని మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించినట్టు జావడేకర్‌ తెలిపారు. ఈసారి హైబ్రిడ్‌ పద్ధతి (వర్చువల్‌, ఫిజికల్‌)లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని