Updated : 12/05/2020 19:36 IST

రానా ప్రేయసి ఎవరో.. ఏం చేస్తారో తెలుసా?

హైదరాబాద్‌: ఎట్టకేలకు కథానాయకుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన హైదరాబాద్‌కు చెందిన మిహికా బజాజ్‌తో ప్రేమలో ఉన్నారు. ఎట్టకేలకు తన ప్రేమ ఫలించిందని, ఆమె అంగీకరించిందని రానా మంగళవారం ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు. ఈ సందర్భంగా రానా ప్రేయసి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

* ముంబయిలోని రచనా సంసాద్‌లో మిహిక ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో డిప్లమా పూర్తి చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్‌ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేశారు.

* మిహిక ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు. ఆమెకు భారతీయ వాస్తుశిల్ప కళంటే ఇష్టమట. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిసింది.

* ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను బట్టి మిహికలో రచయిత్రి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆమె Pixie Dust పేరుతో బ్లాగ్‌ నడుపుతున్నారు.

* మహీక తల్లి బంటీ బజాజ్‌ జ్యువెలరీ డిజైనర్‌. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. తన తల్లిని ఉద్దేశిస్తూ గత ఏడాది మాతృ దినోత్సవం సందర్భంగా మిహిక ఓ పోస్ట్‌ చేశారు. ‘నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. నాకెప్పుడూ నువ్వు మద్దతుగా ఉన్నావు. నీలా ఎవరూ ఉండరు. నాకు తెలిసిన అందమైన, మంచి హృదయం ఉన్న, శ్రమించే, అంకితభావం ఉన్న వ్యక్తివి నువ్వు. నీలో 25 శాతం గుణాలు నాలో ఉన్నా.. నేను అదృష్టవంతురాల్ని. లవ్‌ యూ’ అని తల్లిపై ప్రేమను తెలిపారు.

* 2018లో మిహిక ఈ మ్యాగజైన్‌ యు అండ్‌ ఐతో మాట్లాడారు. ఆ సందర్భంగా తన తల్లి తొలుత కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు నిర్వహించేదని, ఆపై వివాహ అలంకరణ నిర్వహణలో భారతదేశంలో టాప్‌గా నిలిచారని అన్నారు. ‘మా అమ్మ వల్ల చిన్నతనం నుంచి అలంకరణ గురించి చూస్తున్నా. కాబట్టి నా సృజనాత్మకతను మెరుగు దిద్దుకోవడానికి దీనికి మించిన పని లేదు అనిపించింది. ఇప్పటికే తెలిసిన ఫీల్డ్‌ కావడంతో పనులు కూడా సులభంగా జరుగుతాయి’ అని మిహిక పేర్కొన్నారు.

* మిహికకు సోదరుడు సమర్థ్‌ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్‌ను చూసుకుంటుంటారట. తన సోదరుడు ముంబయిలో ఓ కొత్త సంస్థను ప్రారంభించబోతున్నాడని, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని 2018లో ఆమె మ్యాగజైన్‌తో పేర్కొన్నారు. 

 

ఇదీ చదవండి..

ప్రేయసి ఫొటో షేర్‌ చేసిన రానా


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని