Prabhas: ఆ ముగ్గురు.. ఎవరమ్మా?

ప్రభాస్‌ కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఆయన సరసన ఆడిపాడనున్న ముగ్గురు ముద్దుగుమ్మల్ని ఎంపిక చేయడంపై దృష్టిపెట్టింది చిత్రబృందం.

Updated : 16 Feb 2022 09:27 IST

ప్రభాస్‌ కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఆయన సరసన ఆడిపాడనున్న ముగ్గురు ముద్దుగుమ్మల్ని ఎంపిక చేయడంపై దృష్టిపెట్టింది చిత్రబృందం. మరి ప్రభాస్‌తో ఆడిపాడనున్న ఆ ముగ్గురూ ఎవరన్నదే ఇప్పుడు చిత్రసీమలో ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో ముగ్గురు కథానాయికలకి చోటున్నట్టు సమాచారం. తాజాగా ఆ ముగ్గురి ఎంపిక కోసం  కసరత్తులు సాగుతున్నట్టు తెలిసింది. అందులో ఇద్దరు భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు మాళవిక మోహనన్‌ కాగా, మరొకరు శ్రీలీల. తమిళ కథానాయకుడు విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’ చిత్రంతో మెరిసిన కథానాయిక మాళవిక మోహనన్‌. శ్రీలీల ‘పెళ్లిసందడి’తో ఆకట్టుకుంది. ఈ ఇద్దరినీ చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎంతో  ఆసక్తికరమైన ఈ ప్రాజెక్ట్‌ గురించి చిత్రబృందం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని