బోల్డ్‌గా సిమ్రన్‌.. కొత్త అవతారంలో..!

బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న చిత్రం ‘అంధాధున్‌’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లు సాధించింది.....

Updated : 12 Dec 2020 15:22 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న చిత్రం ‘అంధాధున్‌’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో సినిమాను వివిధ భాషల్లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ రీమేక్‌లో నటుడు ప్రశాంత్‌ హీరోగా నటిస్తున్నారు. ఆయన తండ్రి త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్‌ దర్శకుడు. మాతృకలో టబు బోల్డ్‌ రోల్‌లో నటించారు. ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై కోలీవుడ్‌లో ఆసక్తినెలకొంది. ఎట్టకేలకు సిమ్రన్‌ నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తన మొత్తం కెరీర్‌లో విభిన్నమైన పాత్రను పోషించబోతుండటం ఆనందంగా ఈ సందర్భంగా సిమ్రన్‌ అన్నారు.

‘‘భారతదేశ చిత్ర పరిశ్రమలో ‘అంధాధున్‌’ ఓ మైలురాయిలా నిలిచింది. ఇది వివిధ ప్రాంతీయ భాషా ప్రజల్ని కూడా అలరించింది. అలాంటి సినిమాలో టబు పాత్రను పోషించడం ఎంతో పెద్ద బాధ్యత. అది బోల్డ్‌తోపాటు సవాలుతో కూడుకున్నది. తమిళ రీమేక్‌లో నటించేందుకు ఎదురుచూస్తున్నా. నన్ను నేను కొత్త అవతారంలో చూసుకోవాలనుకుంటున్నా. ఈ విషయంలో చాలా ఉత్సుకతగా ఉంది. ఈ పాత్రకు సినిమాలో నిడివి ఎక్కువ. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి అవుతుందన్న నమ్మకం ఉంది’ అని టబు చెప్పారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో హీరో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
‘షకీలా’ టీజర్‌ విడుదల
సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని