‘వైల్డ్‌డాగ్‌’ షూటింగ్‌: నాగార్జున సిద్ధం ఇలా!

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్‌ విరామం తరువాత

Published : 04 Sep 2020 09:22 IST

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్‌ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకొంటోంది. తాజాగా చిత్రబృందం చిత్రీకరణ విశేషాలు వివరిస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో నాగార్జున ముఖానికి రంగులద్దుకుని కెమెరా ముందుకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంద’’ని చిత్ర బృందం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని