ఐటెమ్‌ సాంగ్‌లో నోరా ఫాతెహి

ఇప్పటికే సిద్ధమైన చిత్రాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. ఇటీవలే విదేశాల్లో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘బెల్‌ బాటమ్‌’ సినిమాను మాత్రం  

Published : 06 Nov 2020 11:03 IST

ముంబయి: ఇప్పటికే సిద్ధమైన చిత్రాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. ఇటీవలే విదేశాల్లో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘బెల్‌ బాటమ్‌’ సినిమాను మాత్రం   థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉండనుంది.

ఈ పాటలో బాలీవుడ్‌ యువ అందాల తార నోరా ఫాతెహి నర్తించనుందని చిత్రబృందం ప్రకటించింది. ‘అక్షయ్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడం కన్నా ఆనందం ఏముంటుంది?’ అని నోరా ఉప్పొంగిపోతోంది.   లక్‌నవూ సెంట్రల్‌ చిత్రంతో పేరుతెచ్చుకున్న రంజిత్‌ తివారి ‘బెల్‌  బాటమ్‌’ను తెరకెక్కిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts