‘ఛత్రపతి’ డైరెక్టర్‌గా వి.వి.వినాయక్

‘అల్లుడు శీను’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. అనంతరం ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ చిత్రాలతో మెప్పించిన శ్రీనివాస్‌ తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు..

Published : 27 Nov 2020 13:32 IST

హైదరాబాద్‌: ‘అల్లుడు శీను’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. అనంతరం ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ చిత్రాలతో మెప్పించిన శ్రీనివాస్‌ తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి-యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్‌తో శ్రీనివాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌కి పరిచయం కానున్నారు.

కాగా, బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ సినిమాకి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నట్లు చిత్రబృందం శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్‌ ఎంతో నైపుణ్యం కనబరుస్తారని.. ‘ఖైదీ నం150’తో అది మరోసారి నిరూపితమైందని.. ‘ఛత్రపతి’కి ఆయనే కరెక్ట్‌ అని భావించినట్లు చిత్రబృందం వెల్లడించింది. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ‘ఛత్రపతి’ సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. పెన్‌ స్టూడియోస్‌, డాక్టర్‌.జయంతిలాల్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను కథానాయకుడిగా వెండితెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని