‘జబర్దస్త్‌ స్టేజీపై అదిరే అభి ఫైర్‌’...

హైదరాబాద్‌: నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్డస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

Updated : 06 Jul 2021 20:25 IST

హైదరాబాద్‌: నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్డస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. స్కిట్‌లో భాగంగా హైపర్‌ ఆది ‘ప్రియతమా.. నా హృదయమా’ పాటకు కథానాయిక కాజల్‌ పెళ్లి స్ఫూఫ్‌తో సందడి చేయనున్నారు. ఆది-శాంతిస్వరూప్‌ వరుస పంచులతో పాటు మనో, రోజా తిరిగి పంచులు వేస్తూ ఆకట్టుకోనున్నారు. వెంకీ మంకీస్‌, చలాకీ చంటి, రాకెట్‌ రాఘవ స్కిట్లు సైతం ఆకట్టుకోనున్నాయి. అదిరే అభి స్కిట్‌లో భాగంగా మనోతో కలిసి వరుస పంచులతో నవ్వించే తరుణంలో ‘సెట్‌ బాయ్‌ వచ్చి కుర్చీ పెట్టగా.. ఇప్పుడు ఎందుకొచ్చావ్‌..ఇది టైమింగ్‌ కాదు కదా.. దిగు’ అంటూ అతనిపై ఫైర్‌ కానున్నారు.  దీంతో రోజా అందుకొని.. ‘కూల్‌’ అనగా...‘స్కిట్‌ టైమింగ్ మొత్తం దెబ్బతింటోందని’ ఆవేదన వ్యక్తం చేయనున్నారు. వచ్చే గురువారం (నవంబర్‌ 26) ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి..!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని