ఆ దున్నపోతును పట్టుకునేందుకు..

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని చిత్రాలు సైతం

Published : 22 Sep 2020 19:57 IST

‘జల్లికట్టు’ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని చిత్రాలు సైతం అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు తమ మూవీ బ్యాంక్‌ను పెంచుకోవడంతో పాటు, కొత్తవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇతర భాషల్లో విడుదలైన విజయవంతమైన చిత్రాలను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేస్తున్నాయి. అలా వస్తున్న చిత్రాల్లో ‘జల్లికట్టు’ ఒకటి.

జోసే పెల్లిస్సరీ దర్శకత్వంలో మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా సెప్టెంబరు 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రూ.3కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.20కోట్లు వసూలు చేసింది. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో పెల్లిస్సరీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని