ఓటీటీలో మరో సూపర్‌హిట్‌ చిత్రం

జయం రవి, అరవింద స్వామి ఈ కాంబినేషన్‌ వినగానే మనకు గుర్తొచ్చే తమిళ చిత్రం ‘తని ఒరువన్‌’. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌

Updated : 22 Jul 2023 16:26 IST

హైదరాబాద్‌: జయం రవి, అరవింద స్వామి ఈ కాంబినేషన్‌ వినగానే మనకు గుర్తొచ్చే తమిళ చిత్రం ‘తని ఒరువన్‌’. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బోగన్‌’. హన్సిక కథానాయిక. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు.

2017 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రైలర్‌లో జయం రవి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. మరి అరవిందస్వామి పాత్ర ఏంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! సాయి రిషిక సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని