‘రాఖీబాయ్‌’ సామ్రాజ్యం.. ఎంట్రీ డేట్‌ ఫిక్స్‌!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌-2’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చేసింది. భారీ వసూళ్లను రాబట్టి.. కన్నడ చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డ్రామా ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా...

Updated : 21 Dec 2020 11:15 IST

‘కేజీఎఫ్‌-2’ అప్‌డేట్‌ వచ్చేసింది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌-2’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చేసింది. భారీ వసూళ్లను రాబట్టి.. కన్నడ చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డ్రామా ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌-యశ్‌ కాంబోలో రానున్న ఈ సినిమా  క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల పూర్తయ్యింది. దీంతో త్వరలోనే ఈ పవర్‌ఫుల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘రాఖీభాయ్‌’ సామ్రాజ్యానికి సంబంధించిన టీజర్‌ను వచ్చే ఏడాది యశ్‌ పుట్టినరోజున అనగా జనవరి 8న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

యశ్‌ లుక్‌కు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ‘‘జనవరి 8న ‘రాఖీభాయ్‌’ సామ్రాజ్యంలోకి ప్రవేశించనున్నాం. దీనిని మీ ముందుకు తీసుకురావడానికి ఓ సంవత్సర కాలం పట్టింది. కానీ మేము ఎంతో సమర్థంగా, అందర్నీ మెప్పించే విధంగా రానున్నాం. జనవరి 8న ఉదయం 10.18 గంటలకు కేజీఎఫ్‌ ఛాప్టర్‌2 టీజర్‌ విడుదల చేయనున్నాం’’ అని ప్రకటించారు. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా ‘అధీర’ పాత్రలో మెప్పించనున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేష్‌, రవీనా టాండన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇవీ చదవండి

పవన్‌ కొత్త చిత్రం: అదిరే కాంబినేషన్‌!

నెగిటివ్‌ రోల్‌లో మెప్పించి.. స్టార్‌గా ఎదిగి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని