మరో సినిమా ప్రకటించిన కేజీఎఫ్ డైరెక్టర్
‘కేజీఎఫ్’తో జాతీయ స్థాయిలో గుర్తంపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘కేజీఎఫ్: ఛాప్టర్2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హీరో,
బెంగళూరు: ‘కేజీఎఫ్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘కేజీఎఫ్: ఛాప్టర్2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది కదా..! అయితే.. ఇదిలా ఉండగా.. ఇంకో సినిమా కూడా ప్రకటించి మరో షాక్ ఇచ్చాడీ డైరెక్టర్. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. అంతేకాదు.. సినిమాకు ‘బఘీరా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్‌నీల్ కథ అందిస్తుండగా.. డాక్టర్ సూరి దర్శకత్వం వహించనున్నారు.
హీరో శ్రీమురళి జన్మదినం సందర్భంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. సలార్‌ను నిర్మించనున్న హంబలే సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మించనుంది. కాగా.. శ్రీమురళి ప్రస్తుతం ‘మద గజరాజ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం పూర్తవగానే ‘బఘీరా’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు.. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రశాంత్‌నీల్.. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌తో ఓ సినిమా ప్రకటించగా.. తర్వాతి సినిమాను తారక్‌తో చేసే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇదీ చదవండి..
బెస్ట్ ఆఫ్ కేజీఎఫ్ చూశారా..?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు