కంగన, రంగోలికి మూడోసారి సమన్లు

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌తోపాటు ఆమె సోదరి రంగోలీకి ముంబయి పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు పంపినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో...

Published : 18 Nov 2020 23:08 IST

గతంలో నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌తోపాటు ఆమె సోదరి రంగోలీకి ముంబయి పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా మరోసారి వారికి సమన్లు జారీ చేశారు. నవంబర్‌ 23న కంగనను, 24న రంగోలిని బాంద్రా పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. 

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన, రంగోలీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ అష్రఫ్‌ అలీ సయ్యద్‌ అక్టోబర్‌లో కేసు వేశారు. కేసును పరిశీలించిన ముంబయి కోర్టు కంగనతోపాటు ఆమె సోదరి రంగోలిపై కేసు నమోదు చేయాలని ముంబయి పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసిన బాంద్రా పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ రనౌత్‌ సోదరీమణులకు అక్టోబర్‌ 21 సమన్లు జారీ చేశారు. కానీ కంగన తన న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధిఖీ ద్వారా పోలీసు స్టేషన్‌కు జవాబు పంపారు. అప్పుడు తాము హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నామని, తమ సోదరుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. నవంబర్‌ 10 విచారణకు హాజరు కావాలంటూ నవంబర్‌ 3న మరోసారి వారికి నోటీసులు పంపారు. ఈ సారి వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో తాజాగా పోలీసులు వారికి మూడోసారి సమన్లు జారీ చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts