ఊర్మిళ ఒక శృంగార తార..! : కంగన

వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో కంగన రనౌత్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ముంబయి నగరం, బాలీవుడ్‌ సెలబ్రిటీలపై ఆమె చేసిన చేసిన వ్యాఖ్యలు నానాటికి దుమారం రేపుతున్నాయి. ముంబయిని ఉద్దేశిస్తూ కంగన చేసిన వ్యాఖ్యలపై ఒకానొక ఇంటర్వ్యూలో అలనాటి తార ఊర్మిళ స్పందిస్తూ.. భాజపాలో టికెట్‌ పొందేందుకే...

Published : 18 Sep 2020 02:13 IST

ముంబయి: వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో కంగన రనౌత్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ముంబయి నగరం, బాలీవుడ్‌ సెలబ్రిటీలపై ఆమె చేసిన చేసిన వ్యాఖ్యలు నానాటికి దుమారం రేపుతున్నాయి. ముంబయిని ఉద్దేశిస్తూ కంగన చేసిన వ్యాఖ్యలపై ఒకానొక ఇంటర్వ్యూలో అలనాటి తార ఊర్మిళ స్పందిస్తూ.. భాజపాలో టికెట్‌ పొందేందుకే కంగన ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి నగరం గురించి వివాదస్పదంగా మాట్లాడుతున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఊర్మిళ చేసిన వ్యాఖ్యలపై నటి కంగన ఫైర్‌ అయ్యారు. ఊర్మిళ ఒక శృంగార తార అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఊర్మిళ చేసిన కామెంట్లు నా పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. భాజపా టికెట్‌ పొందడం కోసమే నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నానని ఆమె నాపై ఆరోపణలు చేశారు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే టికెట్‌ పొందడం నాకు అంతపెద్ద కష్టమేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా ఓ శృంగార తారగా మాత్రమే ఆమె ప్రజలకు సుపరిచితురాలైంది. అలాంటిది ఆమే  టికెట్‌ పొందగలిగితే.. నేను ఎందుకు పొందలేను’ అని కంగన అన్నారు.

కాగా, ఊర్మిళను ఉద్దేశిస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్‌ నటీనటులు ఖండించారు. ఊర్మిళను సపోర్ట్‌ చేస్తూ స్వరాభాస్కర్‌, ఫర్హాన్‌ ఖాన్‌, అనుభవ్‌ సిన్హా, తదితరులు ట్వీట్లు పెట్టారు. ఊర్మిళ గొప్ప నటి అని.. ఆమె నటించిన చిత్రాలే దానికి నిదర్శనం అని పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు