Katrina Kaif: కెమెరా... యాక్షన్‌... ‘మెర్రీ క్రిస్మస్‌’

విక్కీ కౌశల్‌తో పెళ్లి తర్వాత శుక్రవారమే కొత్త ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది కత్రినా కైఫ్‌. తమిళ కథానాయకుడు విజయ్‌ సేతుపతితో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. ఈ

Updated : 12 Mar 2022 08:43 IST

విక్కీ కౌశల్‌తో పెళ్లి తర్వాత శుక్రవారమే కొత్త ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది కత్రినా కైఫ్‌. తమిళ కథానాయకుడు విజయ్‌ సేతుపతితో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో క్లాప్‌బోర్డ్‌ ఫొటోను పంచుకుంది కత్రిన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘విజయ్‌ సేతుపతి వంటి నటుడు, శ్రీరామ్‌ రాఘవన్‌ వంటి దర్శకుడు చేస్తున్న ఈ చిత్రంలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది’’ అన్నారు. దీని షూటింగ్‌ కోసం విజయ్‌సేతుపతి వచ్చే వారమే ముంబయికి రానున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్రబృందం యోచిస్తోంది. ప్రస్తుతం కత్రిన ‘ఫోన్‌ భూత్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని