Nenu Miku Baga Kavalsina Vadini: బాగా కావల్సినోడు

దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్యదీప్తి నిర్మాతగా మారారు. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్‌ శంకర్‌  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాకీ భాగం చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఆ సినిమాకి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’

Updated : 24 Feb 2022 08:48 IST

దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్యదీప్తి నిర్మాతగా మారారు. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్‌ శంకర్‌  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాకీ భాగం చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఆ సినిమాకి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే పేరుని ఖరారు చేశారు. పేరుని ప్రకటించడంతోపాటు, ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాల్ని రూపొందించారు కోడి రామకృష్ణ. తెలుగు ప్రేక్షకులకి ఆయన బాగా కావాల్సినవాడిగా కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. కిరణ్‌ అబ్బవరం మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు వేగంగా చేరువయ్యారు. ఈ చిత్ర కథ అందరికీ కనెక్ట్‌ అయ్యే భావోద్వేగాలతో కూడుకున్నది కావడంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే పేరుని ఖరారు చేశాం. యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరంని  కమర్షియల్‌ హీరోల సరసన నిలబెట్టే చిత్రమిది. మణిశర్మ వినసొంపైన సంగీతాన్ని అందించార’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని