కోలీవుడ్‌లో సంక్రాంతి.. ఆ రెండూ ఓటీటీలోనే!

థియేటర్లు తెరుచుకున్నాయి. మునుపటి కోలహాలం మళ్లీ కనిపిస్తోంది. అయినప్పటికీ తమిళ హీరోలు తమ సినిమాలను ఓటీటీల్లో

Published : 28 Dec 2020 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: థియేటర్లు తెరుచుకున్నాయి. మునుపటి కోలహాలం మళ్లీ కనిపిస్తోంది. అయినప్పటికీ తమిళ హీరోలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ‘తనిఒరువన్‌’, ‘బోగన్‌’, ‘కోమలి’ సినిమాలతో హిట్లు కొట్టిన జయం రవి, కాగా మరో నటుడు మాధవన్‌. రైతుల సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో జయం రవి నటించిన ‘భూమి’ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో సంక్రాంతి రోజున విడుదలవుతుంది.

దానికి కొన్ని రోజుల ముందే మాధవన్‌ కొత్త  సినిమా ‘మారా’ జనవరి 8న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతుంది. ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన దుల్కర్‌ సల్మాన్‌ ‘చార్లీ’కి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కుతోంది. అలా ఒకప్పుడు థియేటర్లలో సంక్రాంతికి బరిలోకి దిగిన కథానాయకులు ఇప్పుడు ఓటీటీల్లో పోటీపడుతున్నారు. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ మాత్రం థియేటర్లలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని