‘కృష్ణవేణి.. నీతోటి కష్టమే.. నువ్వంటే ఇష్టమే’

రాజ్‌తరుణ్‌, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా

Updated : 29 Jun 2023 17:44 IST

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా, అక్టోబరు 2న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘కృష్ణవేణి’ వీడియో సాంగ్‌ను యువ కథానాయకుడు నాగశౌర్య విడుదల చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనూప్‌రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ కుమార్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని