‘ఒరేయ్ బుజ్జిగా’.. వీడియో సాంగ్‌ చూశారా..!

రాజ్‌ తరుణ్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...

Updated : 06 Dec 2022 16:08 IST

హైదరాబాద్: రాజ్‌ తరుణ్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఒరేయ్‌ బుజ్జిగా’ నుంచి ‘కృష్ణవేణి’, ‘ఈ మాయ పేరేమిటో’ ఫుల్‌ వీడియో సాంగ్స్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అయితే తాజాగా శుక్రవారం ఈ సినిమా నుంచి ‘కురిసేనా కురిసేనా’ సాంగ్‌ వీడియోను హీరో నిఖిల్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. అర్మాన్‌ మాలిక్‌, మేఘనా ఈ పాటను అలపించారు.

విభిన్న ప్రేమకథతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. హెబ్బాపటేల్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ మేరకు అక్టోబర్‌ 1న ఆహా వేదికగా ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని