LIGER: ‘లైగర్‌’ కోసం టైసన్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌ టైగర్‌ మైక్‌ టైసన్‌ కెమెరా ముందుకు రానున్నారు. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడి సెకన్ల వ్యవధిలోనే మట్టి కరిపించే ప్రఖ్యాత బాక్సర్‌... టైసన్‌. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న

Updated : 28 Sep 2021 07:00 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌ టైగర్‌ మైక్‌ టైసన్‌ కెమెరా ముందుకు రానున్నారు. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడి సెకన్ల వ్యవధిలోనే మట్టి కరిపించే ప్రఖ్యాత బాక్సర్‌... టైసన్‌. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన తొలిసారి భారతీయ తెరపై సందడి చేయబోతుండడం విశేషం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌బ్రీడ్‌’ అనేది ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు రూపొందిస్తున్నాయి. పూరి జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు విదేశీ ఫైటర్లు కనిపించనున్నారు. ఇందులోని ఓ కీలకమైన పాత్ర కోసం ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ని సంప్రదించి ఒప్పించింది చిత్రబృందం. ఆ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ‘లైగర్‌’ చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. స్టంట్‌ డైరెక్టర్‌ కెచ్చా నేతృత్వంలో కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన అనన్యపాండే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు