Published : 16 Oct 2020 22:28 IST

మేఘనా బేబీ షవర్‌.. ఎమోషనల్‌ వీడియో

బాధను దిగమింగి.. పుట్టబోయే బిడ్డకు..

బెంగళూరు: ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 39 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. మరికొన్ని నెలల్లో తండ్రి కాబోతున్న తరుణంలో ఇలా జరగడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు 17న చిరంజీవి సర్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా తన సోదరుడ్ని గుర్తు చేసుకుంటూ ధృవ్‌ సర్జా సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే చిరు.. నా ప్రేమ నీకెప్పటికీ ఉంటుంది. త్వరలోనే జూనియర్‌ చిరు రాబోతున్నాడు’ అంటూ మేఘనా బేబీ షవర్‌ వీడియోను పంచుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య జరిగిన ఈ వేడుక అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. బాధను తట్టుకుని.. కుటుంబ సభ్యులంతా త్వరలో పుట్టబోతున్న శిశువుకు స్వాగతం చెప్పారు.

‘బేబీ షవర్‌’లో చిరు మేనమామ, నటుడు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘పరిస్థితులు మారుతుంటాయి, వాటిని దాటుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాల్సిందే. దీన్ని నేను గట్టిగా నమ్ముతా. అందుకే మేం దుఖాఃన్ని దిగమింగుకుని పాజిటివ్‌గా, దృఢంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. గతాన్ని మర్చిపోవడం కన్నా.. బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. మేఘనా.. మేమంతా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం. నెగిటివిటీని పాజిటివిటీగా మార్చి.. మా కుటుంబంలోకి రాబోతున్న మా డార్లింగ్‌, మా జూనియర్‌ చిరుకు నవ్వుతూ ఆనందంగా స్వాగతం చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’ అని అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts