పెళ్లి తర్వాత జీవితం.. రానా ఏమన్నారంటే?

వివాహం తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు జరగలేదని కథానాయకుడు రానా పేర్కొన్నారు. ఆయన తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను మనువాడి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్‌, వెడ్డింగ్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సముద్ర తీరానా తీసుకున్న ఫొటోను.....

Published : 01 Nov 2020 01:16 IST

హైదరాబాద్‌: వివాహం తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు జరగలేదని కథానాయకుడు రానా పేర్కొన్నారు. ఆయన తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను మనువాడి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్‌, వెడ్డింగ్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సముద్ర తీరానా తీసుకున్న ఫొటోను ఇటీవల మిహీకా షేర్‌ చేయగానే.. వైరల్‌గా మారింది. రానా తాజాగా పెళ్లి తర్వాత జీవితం గురించి మీడియాతో ముచ్చటించారు. ‘పెళ్లైతే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని అంటారు. కానీ నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. నా జీవితంలో అలాంటి ప్రధానమైన మార్పులు ఏమీ జరగలేదు. కాకపోతే వివాహం తర్వాత నాకు బాధ్యత పెరిగింది, కాస్త స్థిరంగా ఉన్నా. మిహీకా చాలా సరదాగా ఉంటుంది. ఆమెతో కలిసి సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది. మిహీకాతో కలిసి నా మిగిలిన జీవితాన్ని కూడా గడపడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించారు.

అనంతరం తన తర్వాతి సినిమా ‘అరణ్య’ గురించి మాట్లాడుతూ.. ‘మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏనుగుల కారిడార్‌లను మానవులు ఆక్రమించి, తమ స్థావరాలుగా మార్చుకుంటున్నారు. దీని వల్ల పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రభు ‘అరణ్య’ను ఆసక్తికరంగా రూపొందించాడు. ఈ సినిమా కచ్చితంగా అందరి మెప్పు పొందుతుంది’ అని చెప్పారు. మరోపక్క రానా ‘1945’, ‘విరాట పర్వం’, ‘హిరణ్య కశ్యప’ తదితర సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని