మహేశ్‌.. వాట్‌ ఏ ఛేంజ్‌..!

సినిమా సినిమాకీ యంగ్‌ లుక్‌తో కనిపిస్తూ సినీ ప్రియులను ఫిదా చేస్తుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో క్లాస్‌+మాస్‌ లుక్స్‌తో మెప్పించిన ఆయన తాజాగా తన సరికొత్త లుక్‌తో మరోసారి అభిమానులను హృదయాలను కొల్లగొట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో...

Updated : 10 Sep 2020 11:24 IST

సూపర్‌స్టార్‌ లుక్‌కు అభిమానులు ఫిదా

 

హైదరాబాద్‌: సినిమా సినిమాకీ యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ సినీ అభిమానులను ఫిదా చేస్తుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో క్లాస్‌+మాస్‌ లుక్స్‌తో మెప్పించిన ఆయన తాజాగా తన సరికొత్త లుక్‌తో మరోసారి అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేశ్‌ తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షూట్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ సారథ్యంలో ఈ షూటింగ్‌ జరిగింది. షూటింగ్‌ అనంతరం మహేశ్‌ న్యూలుక్‌కు సంబంధించిన ఓ సరికొత్త ఫొటోను అవినాష్‌ తన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘కొవిడ్‌ విరామం తర్వాత సూపర్‌స్టార్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. స్మాషింగ్‌ న్యూలుక్‌తో మహేశ్‌ తిరిగి వర్క్‌లోకి అడుగుపెట్టారు’ అని అవినాష్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, అవినాష్‌ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్‌ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. లైకులు, షేర్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్‌ మహేశ్‌.. నువ్వు సూపర్‌’, ‘మహి.. మీరు  రోజు రోజుకీ మరింత యంగ్‌గా మారుతున్నారు’, ‘మహేశ్‌.. వాట్‌ ఏ ఛేంజ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేశ్‌ హీరోగా  ‘సర్కారువారి పాట’ తెరకెక్కనుంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని