
పూరీకి మహేశ్ శుభాకాంక్షలు
విజయం మీతో ఉండాలి..
హైదరాబాద్: దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమాన దర్శకుల్లో పూరీ ఒకరని.. ఆయనకి విజయం వెన్నంటే ఉండాలని కోరుకున్నారు. పూరీ పుట్టినరోజు పురస్కరించుకుని మహేశ్‌తోపాటు పలువురు తెలుగు సినీ నటీనటులు సోషల్‌మీడియా వేదికగా ఇస్మార్ట్ డైరెక్టర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘పూరీ సర్.. హ్యాపీ బర్త్‌డే టు యూ. మీరు నన్ను ఓ సంతోషకరమైన వ్యక్తిగానే కాకుండా నటుడిగా మార్చారు. కష్టాలను కూడా సంతోషంగా ఎదుర్కోవడం మీవల్లే నాకు తెలిసింది. ఓ సినిమా మనం కలిసేలా చేసింది. కానీ సినిమా కంటే ఎక్కువగా మీరు నా హృదయానికి ఎప్పుడూ చేరువగా ఉంటారు’ - విజయ్ దేవరకొండ
‘హ్యాపీ బర్త్‌డే పూరీ సర్. మీరు ఇలాగే మాలో స్ఫూర్తి నింపాలని ఆశిస్తున్నా’ - అనిల్ రావిపూడి
‘మై గన్ పూరీజగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో మీరు కూడా ఒకరు. ఈ ఏడాది మీకంతా విజయమే చేకూరాలని కోరుకుంటున్నా. లవ్ యూ’ - రామ్
‘నాకెంతో ఇష్టమైన పూరీజగన్నాథ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నీ నవ్వు, సమస్యలతో నువ్వు పోరాడే తీరు నాలాంటి ఎంతో మందికి ఆదర్శం. నీకు అన్నింటిలో బెస్ట్ దక్కాలని కోరుకుంటున్నా లవ్ యూ సర్ జీ’ - బాబీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.